విలన్ గా మారిన గొప్ప శాస్త్రవేత్త, నిజమైన దేశ భక్తుడు..నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా కోలీవుడ్ స్టార్ హీరో ఆర్.మాధవన్ తెరకెక్కించిన చిత్రం ‘రాకెట్రీ’. వచ్చే నెల 1న ఈ ఫిల్మ్.. దేశవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆర్.మాధవన్ ఈ సినిమా స్టోరి రచించి, దర్శకత్వం వహించడంతో పాటు టైటిల్ రోల్ ప్లే చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. సైంటిస్టుగా మాధవన్ తన నటనతో అదరగొట్టేశాడు. పూర్తిగా పాత్రలో ఒదిగిపోయాడని చెప్పొచ్చు. ఇండియాలో ఇంజినీర్ గా పని చేస్తున్న క్రమంలో నంబి నారాయణన్..కు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ నుంచి ఆఫర్ రావడం..ఆ తర్వాత జరిగిన పరిణామాలను గురించి సినిమాలో వివరించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.
సైంటిస్ట్ వైఫ్ గా సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటించింది. ఈ మూవీలో ఇంగ్లిష్ వర్షన్ లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ ప్లే చేయగా, సౌత్ వర్షన్ లో సూర్య అతిథి పాత్ర పోషించారు. ఈ సినిమాపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
Watch the new trailer of #Rocketry, an Incredible journey of a rocket scientist! Film releasing on 1st July, 2022
Hindi Trailer: https://t.co/vbea2CTmzR
Tamil Trailer: https://t.co/coH9ExGYk5
Telugu Trailer: https://t.co/KAbKU5GcAj
Malayalam Trailer: https://t.co/8FCYeirGQW
— Ranganathan Madhavan (@ActorMadhavan) June 23, 2022