టిక్‌ టాక్‌ను తలదన్నే ఇండియన్‌ యాప్‌.. “జోష్‌” తో బిజీ అయిపోండిక..!

-

చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం కార‌ణంగా భార‌త్‌లో 59 చైనీస్ యాప్స్‌ను నిషేధించించిన‌ప్ప‌టి నుంచి దేశంలో టిక్‌టాక్ యూజ‌ర్ల‌కు తీవ్ర అవ‌స్థ క‌లుగుతోంది. అప్పటి వ‌ర‌కు ఎంతో స‌ర‌దాగా టిక్‌టాక్‌లో కాల‌క్షేపం చేసిన వారు.. ఆ యాప్ బ్యాన్ అయ్యే సరికి ఏదో కోల్పోయిన‌ట్లు ఫీల‌వుతున్నారు. అయితే అలాంటి యూజ‌ర్ల కోసం డెయిలీ హంట్ కొత్త‌గా జోష్ (Josh)పేరిట ఓ షార్ట్ మెసేజింగ్ వీడియో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.  టిక్‌టాక్‌ను పోలిన ఫీచ‌ర్ల‌నే ఇందులో ప్రస్తుతానికి ఉన్నా అంతకు మించిన ఫీచర్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

Josh యాప్ ప్ర‌స్తుతం యూజ‌ర్ల‌కు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇందులో ప‌లు భిన్న ర‌కాల కేట‌గిరిల్లో షార్ట్ వీడియోల‌ను యూజ‌ర్లు పోస్ట్ చేయ‌వ‌చ్చు. ఇత‌రులు పోస్ట్ చేసిన వీడియోల‌ను వీక్షించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ యాప్‌కు ప్లే స్టోర్‌లో యూజ‌ర్ల నుంచి రేటింగ్స్ కూడా బాగానే ల‌భిస్తున్నాయి. అనేక మంది ఈ యాప్‌ను ఇప్ప‌టికే డౌన్‌లోడ్ చేసుకున్నారు. టిక్‌టాక్‌ను మిస్ అవుతున్నామ‌ని భావించే వారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో విహ‌రించ‌వ‌చ్చు.

జోష్ యాప్ లో యూజ‌ర్లు త‌మ మొబైల్ నంబ‌ర్ ద్వారా లాగిన్ అయితే సొంత ప్రొఫైల్‌ను మెయింటెయిన్ చేయ‌వ‌చ్చు. టిక్‌టాక్ క‌న్నా అద్భుత‌మైన‌, నాణ్య‌మైన షార్ట్ వీడియోల‌ను ఈ యాప్‌లో పోస్ట్ చేసే అవ‌కాశం క‌ల్పించారు. ప్ర‌స్తుతం టిక్‌టాక్‌కు అనేక దేశీయ యాప్స్ పోటీగా అందుబాటులో ఉన్నా.. జోష్ మాత్రం అన్నింటిక‌న్నా భిన్నంగా.. క్వాలిటీ గల ఫీచ‌ర్ల‌ను అందిస్తుండ‌డం విశేషం. ఇంకెందుకాల‌స్యం.. వెంట‌నే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మ‌రి.. టిక్‌టాక్‌ను మిస్ అవుతున్నామ‌నుకునే వారికి జోష్ యాప్ చ‌క్క‌ని కాల‌క్షేపం అని చెప్ప‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news