
గాల్వాన్ లోయలో ఘటన జరిగిన తరువాతా భారత్ చైనా సంబంధాలు చాలా దారుణంగా మారాయి. ఇరు దేశ అధినేతలు ఆర్మీ చీఫ్ లకు పూర్తి హక్కులను ఇచ్చేశారు. పరిస్థితి ఏమాత్రం ఉద్రిక్తంగా మారినా ఆర్మీ చిఫ్ లు తమదైన రీతిలో చర్యలు చేపట్టవచ్చు. కానీ ఉదృతలు ఆగుతున్నాయా అంటే లేదు అనే సమాధానం వినిపిస్తుంది. గాల్వాన్ లోయలోనే మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఇటు మన సైనికులు అటు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరడంతో ప్రమాధకార పరిస్తితి నెలకొంది. భారత్ చైనా బలగాలు భారీగా మోహరించాయి గాల్వాన్ పాయింట్ నంబర్ 14 వద్ద, పాగాంగ్ టీఎస్‌ఓ వద్ద ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనికులు ఫిరంగులను ట్యాంకులను సిద్ధం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.