గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. భారత ఆర్మీపై గుల్పూర్ సెక్టార్ లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు దిగింది. భారత సైన్యాన్ని సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పూంచ్ సెక్టార్ పరిధిలోని గూల్పూర్ సెక్టార్ లో కాల్పులకు దిగగా దానిని భారత ఆర్మీ తిప్పికొట్టింది. కాల్పుల శబ్దం రాగానే అప్రమత్తమైన మన బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి.
అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడగా, ఒక పాకిస్తాన్ జవాన్ ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ప్రస్తుతం పాకిస్తాన్ వెనక్కు తగ్గిందని ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా సరిహద్దు గ్రామాల్లో అలజడి రేగుతుంది. పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగడంతో పాటుగా సరిహద్దు గ్రామాల్లో బ్యాట్ దళాలు గ్రామస్తులను టార్గెట్ చేస్తూ వస్తున్నాయి.
ఇటీవల ఒక గ్రామస్తుడి తల నరికి బ్యాట్ దళాలు తీసుకు వెళ్ళాయి. పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల సహకారంతో ఈ బాట్ ని ఏర్పాటు చేస్తారు. బోర్డర్ యాక్షన్ టీం గా దీన్ని పిలుస్తారు. గణతంత్ర వేడుకలను కాశ్మీర్ లో పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని దీనితో భారత బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడా కూడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడుతున్నాయి.