సాయి ప్రణీత్ భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్. ప్రకాష్ పదుకొనె 1983లో బ్రాంజ్ మెడల్ పొందిన తర్వాత 36 ఏళ్ల కి సాయి ప్రణీత్ మొట్టమొదటిసారి బ్రాంజ్ మెడల్ బాడ్మింటన్ కి పొందారు. ఎన్నో విజయాలను, అవార్డును సాయిప్రణీత్ దక్కించుకున్నారు.
సాయి ప్రణీత్‌కు 2019 లో అర్జున్ అవార్డు లభించింది. మరి ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ కి సంబంధించిన అనేక వివరాలు మనం ఇప్పుడే తెలుసుకుందాం. ఆలస్యమెందుకు దీని కోసమే పూర్తిగా చూసేయండి.
భమిడిపాటి సాయి ప్రణీత్ కుటుంబం:
భమిడిపాటి సాయి ప్రణీత్ శేషాద్రి దీక్షితులు మరియు మాధవి లత దంపతులకి పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించారు. సాయి ప్రణీత్ మేనత్త నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్.
సాయి ప్రణీత్ ఎన్నో విజయాల్ని పొందాడు. సాయి ప్రణీత్ అనేక టోర్నమెంట్లో అద్భుతంగా ప్రదర్శించాడు. అవార్డుని, రికార్డులని కూడా దక్కించుకున్నాడు.
సాయి ప్రణీత్ అందుకున్న అవార్డులు, సృష్టించిన రికార్డులు:
స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పెద్ద విజయం వచ్చింది. అక్కడ అతను కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. భారతదేశం కి 36 సంవత్సరాల నుండి ఏ పతాకం రాలేదు. ప్రకాష్ పడుకొనే తరువాత మెగా ఈవెంట్‌లో పతకం సాధించిన పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ రెండో భారతీయుడు అయ్యాడు.
2017 లో సింగపూర్ ఓపెన్‌లో సాయి ప్రణీత్ తన తొలి బిడబ్ల్యుఎఫ్ సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మాజీ ప్రపంచ నంబర్ 1 కిదాంబి శ్రీకాంత్‌ను ఓడించాడు.
సాయి ప్రణీత్ 2017 లో థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్లో బంగారు పతకాన్ని సాధించాడు.
పెద్ద ఈవెంట్లలో పోటీదారుగా మారిన ప్రణీత్ కెరీర్‌లో 2019 ఒక మలుపు తిరిగింది. అతని ఉత్తమ ప్రదర్శన చెన్ లాంగ్తో లో జరిగింది, అతను ఒలింపిక్ ఛాంపియన్ మరియు సెమీఫైనల్లో ప్రపంచ 5 వ స్థానంలో నిలిచాడు. అతను 21-18, 21-13తో గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. బంగారు పతాకం దక్కలేదు. సిల్వర్ మెడల్ మాత్రమే దక్కింది.
18 సంవత్సరాల వయస్సులో, సాయి ప్రణీత్ 2010 లో మెక్సికోలో జరిగిన బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. అతను పుల్లెల గోపిచంద్ యొక్క విద్యార్థులలో ఒకడు. ఇలా రెండు సంవత్సరాల శిక్షణ తర్వాత సాయి ప్రణీత్ కాంస్యం పొందాడు.