Tokyo 2020: యాంటీ సెక్స్ బెడ్స్..!

-

టోక్యో ఒలంపిక్స్(Tokyo Olympics) కి క్రీడాకారులకి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జపాన్ లో జరిగే ఒలింపిక్స్ కి క్రీడాకారులు వెళ్లనున్నారు. అయితే ఇక్కడ క్రీడాకారులకి యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే స్పానిష్ న్యూస్ ఔట్లెట్ ప్రకారం కరోనా మహమ్మారి కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రతి ఒక్క అథ్లెట్ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

సెక్సువల్ ఇంటర్ కోర్స్ తో సహా అనవసరంగా ఇతరుల వద్దకు వెళ్లడం సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉండడం లాంటివి చేయొద్దు అని అంటున్నారు. తప్పకుండా క్రీడాకారులు వీటిని పాటించాలని తెలుస్తోంది.

ఇక యాంటీ సెక్స్ బెడ్స్ విషయంలోకి వస్తే… ఈ మంచాలని కార్డ్బోర్డ్ తో తయారు చేయడం జరిగింది. అయితే ఈ బెడ్స్ ఒక మనిషి బరువు మాత్రమే తట్టుకోగలవు. ఒకవేళ కనుక అవసరమైన కదలికలు ఉంటే విరిగిపోవడం జరుగుతుంది.

ఈ విరిగిపోయిన వాటిని రీసైకిల్ చేయవచ్చు అని తెలుస్తుంది. అలానే ఒలంపిక్స్ ట్రెడిషనల్ ప్రకారం ఇచ్చే ఫ్రీ కండోమ్స్ ని కూడా ఉపయోగించకూడదని హెచ్చరిస్తున్నారు. అక్కడ వాటిని ఉపయోగించకుండా తిరిగి వాటిని ఇంటికి తీసుకు రావాలని.. తీసుకు వచ్చిన తర్వాత హెచ్ఐవి పై అవగాహన కల్పించాలని తెలియజేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news