సీమా గులాం హైదర్, 27, 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో పబ్‌జి ఆడుతున్నప్పుడు కలుసుకున్న మరియు ప్రేమలో పడిన తన భారతీయ ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండటానికి వీసా , పౌరసత్వం లేకుండా నేపాల్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించడానికి సరిహద్దు దాటింది. ఏడేళ్ల లోపు వయసున్న తన నలుగురు పిల్లలను కూడా వెంట తెచ్చుకుంది. ఈ జంట దేశంలోని ఉత్తరాన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని అపార్ట్‌మెంట్‌లో నివసించడం ప్రారంభించారు.
ఇదిలా అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం, ఇతర దేశాలకు చెందిన వ్యక్తి ఆశ్రయం కల్పించడం వంటి కేసులో సీమా, సచిన్ ఇద్దరు అరెస్టయ్యారు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. ఇదిలా ఉంటే సీమా తన భర్త హిందువు, భారతీయుడని, ఇప్పుడు నేడు కూడా హిందువు, భారతీయులరాలినే అని ప్రకటించింది. తాను ఇకపై పాకిస్తాన్ వేళ్లేది లేదని, ఇకపై భారతదేశమే నా దేశం అని ప్రకటించింది. తాను ఇకపై చికెన్ బిర్యానీ విడిచిపెట్టినట్లు తెలిపింది. హిందూ మతంలోకి మారి తులసి పూజ, దేవీదేవతల పూజను ప్రారంభించారు సీమా హైదర్. నమస్కారంతో పెద్దలను పలకరించడంతో పాటు, పాదాలను తాకి ఆశీర్వాదాన్ని కోరుతున్నారు. సీమ తనకు ఇష్టమైన చికెన్ బిర్యానీ, మాంసం మరియు చేపలను కూడా వదులుకుంది. భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీరించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె తన మెడలో రాధే రాధే పట్టిని ధరిస్తున్నారు. తాను ప్రేమ కోసమే ఇదంతా చేస్తున్నట్లు చెబుతున్నారు.