ఏపీలో సీఎం జగన్ ప్రజల కష్టాలనే తన కష్టాలుగా భావించి పాలనను సాగిస్తున్నారు. నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తూ విభిన్న పధకాలను తీసుకువస్తూ ప్రజల గుండెల్లో ప్రజానాయకుడిగా ముద్ర వేసుకున్నాడు. కాగా తాజాగా మరొక నిర్ణయంతో ఎంతో కష్టపడి చదివి, సంవత్సరాల తరబడి డీఎస్సీ కోసం ట్రైనింగ్ తీసుకుని ప్రభుకిత్వం ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు. వారందరికీ శుభవార్తను అందచేస్తూ కాసేపటి క్రితమే ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి కీలకమైన సమాచారాన్ని టీచర్ లుగా స్థిరపడాలి అనుకుంటున్న వారికి తెలియచేశాడు. ఈయన తాజాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను అతి త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించాడు. ఈయన తెలిపిన ప్రకారం ఆగస్ట్ లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
ఇందుకు తగిన విధంగా అధికారులు కష్టపడుతున్నారని త్వరలోనే నోటిఫికేషన్ ను వదులుతామని బొత్స తెలియచేశారు. ఈ వార్త విన్న నిరుద్యోగులు ఆనందంలో మునిగితేలుతున్నారు.