శుక్రవారం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతీయ కంపెనీలు ఇక విదేశీ ఎక్స్చేంజీలు, అహ్మదాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్‌సీ)లో నేరుగా లిస్టింగ్‌కు వెళ్లవచ్చని వెల్లడించారు. త్వరలో ఈ వెసులుబాటు అందుబాటులోకి రానుందని సమాచారం. ఇది దేశీయ కంపెనీలకు ఒక మంచి శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్లలోని వివిధ ఎక్స్చేంజీల్లో భారత కంపెనీలు నేరుగా లిస్ట్ అయితే ఆయా కంపెనీలకు విదేశీ నిధులు పొందడానికి వీలుగా ఉంటుంది.
ఐఎఫ్ఎస్‌సీలోనూ లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు నేరుగా లిస్ట్ అయ్యే అవకాశాన్ని కల్పించనున్నట్లు వారు తెలిపారు. దీంతో విదేశీ నిధులు సమకూర్చుకోవడంతో పాటు మంచి వ్యాల్యుయేషన్ కు అవకాశముందన్నారు మంత్రి నిర్మల. దేశీయ కంపెనీలకు మొదట ఐఎఫ్ఎస్‌సీలో అనుమతిచ్చి, ఆ తర్వాత ఏడెనిమిది ఎంపిక చేసిన దేశాల్లోని స్టాక్ ఎక్స్చేంజీలకు అనుమతిస్తారని అధికారులు చెబుతున్నారు. తొలి దశలో అమెరికా, బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో లిస్టింగ్ కు అవకాశమివ్వనున్నట్లు సమాచారం.