ఇండియన్ ఫ్యాన్స్ వ్యక్తిపూజ మానుకోవాలి: మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్

-

ఇండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు భారత క్రికెట్లో వ్యక్తి పూజను అభిమానులు మానుకోవాలని ఆయన సూచించారు. ఫ్యాన్స్ జట్టు మాత్రమే ప్రేమించాలి కానీ వ్యక్తుల్ని కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.2011 వరల్డ్ కప్ చూసుకుంటే.. యువరాజ్ సింగ్, గంభీర్, జహీర్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోనీ.. ఇలా అందరూ అద్భుతంగా ఆడారు. ఒక్కరే గెలిపించడానికి ఇదేమీ రెజ్లింగ్ వంటి వ్యక్తిగత ఆట కాదు కదా! అందరూ ఆడితేనే గెలుపు అని అన్నారు. మన క్రికెట్లో ఈ హీరో కల్చర్ పోవాలి’ అని స్పష్టం చేశారు.

ఇక 2007లో ఇండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రవీణ్ కుమార్ 68 వన్డేలు, 10 టీ20లు, 6 టెస్టులు ఆడాడు. ఇందులో వరుసగా 77, 8, 27 వికెట్లు తీశాడు. ప్రవీణ్ కుమార్ 2008, 2010లో అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ ప్రదర్శనల తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అయితే గాయం కావడంతో ఆ వరల్డ్ కప్పులో ఆడ లేక పోయారు.అలాగే చివరిసారిగా 2012లో టీమ్ ఇండియా తరపున ఆడిన ప్రవీణ్ కుమార్ 2018లో క్రికెట్ కి గుడ్ బై చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news