చైనా లోని గ్యాంగ్జౌ లో జరుగుతున్న 19వ ఆసియన్ గేమ్స్ లో భారత్ అదరగొడుతోంది. ఒక కొత్త ఉత్సాహంతో ప్రతి విభాగంలో ఉత్తమ ప్రదర్శనను కనబరుస్తూ రోజు రోజుకి పతకాల సంఖ్యలో మార్పును చూపిస్తోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆసియన్ గేమ్స్ లో భారత్ తన పతకాల వేటను ఈ రోజుతో ముగించింది. అయితే ఈ సారి భారత్ మాత్రం ఎన్నడూ లేనంతగా అత్యధికంగా 107 పతకాలను గెలుచుకుంది. ఇది నిజంగా చరిత్ర అంటూ భారత్ ను ప్రధానితో సహా ఎందరో ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఈ ఆసియన్ గేమ్స్ లో భారత్ మొత్తం 107 పతకాలను గెలుచుకోగా అందులో 28 స్వర్ణ పతకాలు, 38 వెండి మరియు 41 కాంస్య పథకాలను గెలుచుకుని రికార్డ్ సృష్టించింది. అలా భారత్ పాయింట్ల పట్టికలో 4 వ స్థానంలో నిలిచింది.
అయితే భారత్ అత్యధికంగా 1962 లో జకార్తా లో జరిగిన ఆసియన్ గేమ్స్ లో మూడవ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకూ కూడా ఇదే అత్యుత్తమ స్థానం. ఇక రేపటితో ఆసియన్ గేమ్స్ ముగియనున్నాయి.