భారత నౌకాదళ అమ్ములపొదిలో మరో ఆయుధం

భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో స్కార్పైన్‌ క్లాస్‌ సబ్‌ మెరైన్‌ వగిర్‌ చేరింది. ముంబై తీరంలో వగిర్‌ జలప్రవేశం చేసింది. ఇప్పటికే భారత్‌ వద్ద నాలుగు స్కార్పైన్‌ క్లాస్‌ సబ్‌మెరైన్లు ఉన్నాయి. 2015లో ప్రారంభించిన INS కల్వరి వీటిలో మొదటిది. వగిర్‌ సబ్‌ మెరైన్‌ను డిఫెన్స్‌ ప్రభుత్వరంగ సంస్థ అయిన మజ్గాం డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ – MDSL తయారు చేసింది. రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దీనిని ప్రారంభించారు.

సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఫ్రాన్స్‌కు చెందిన నేవల్‌ గ్రూప్‌తో కలిసి పని చేస్తోంది మజ్గాం డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ – MDSL. ఈ మేరకు ఆ సంస్థతో ప్రాజెక్ట్‌ 75 పేరుతో 23 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఒప్పందం కుదుర్చుకుంది.