ప్రియుడిని పరిచయం చేసిన చిన్నారి పెళ్లికూతురు

హీరోయిన్ అవికా గోర్ తన ప్రియుడిని పరిచయం చేసింది. మిలింద్ చద్వానీతో ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియాలో తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. తన లవర్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది అమ్మడు. ఈ బంధం తన జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించబోతుందని చెప్పుకొచ్చింది అవికా. అయితే, ఈ ముద్దుగుమ్మకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట. ఈ ఇడియట్ నా హృదయాన్ని కదిలించాడని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉందంటూ, ప్రేమికుడిపై ప్రశంసలు గుప్పించింది అవికా గోర్.

”నా ప్రార్ధనలకు సమాధానం లభించింది. నా లైఫ్‌లో లవ్ దొరికింది. మనల్ని అర్ధం చేసుకుని.. మనకి స్ఫూర్తినిచ్చి.. మనం ఎదగడంలో సాయం చేసి.. మనల్ని జాగ్రత్తగా చూసుకునే భాగస్వామి కావాలని మనం కోరుకుంటాం. కానీ చాలామంది దీన్ని అసాధ్యం అనుకుంటారు. కలగా భావిస్తారు. అయితే జరుగుతున్నది అంతా నిజం. మీకోసం నేను ప్రార్ధిస్తాను. నేను ఇప్పుదేడైతే ఫీల్ అవుతున్నానో.. అదే భావన మీరు కూడా ఒక రోజున పొందాలని ఆశిస్తాను. నాకు ఈ అనుభూతిని ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు. ఈ బంధం నా జీవితంలో చాలా కీలకమైంది” అని పేర్కొంటూ అవికా గోర్ తన లవ్ లైఫ్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.