టెక్సాస్ ప్రైమరీ ఎన్నికల్లో సత్తా చాటిన ప్రవాసభారతీయుడు

-

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో టెక్సాస్ లో డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ప్రెస్టన్ కులకర్ణి విజయం సాధించారు. దీనితో నవంబర్ లో జరిగే ఎన్నికల్లో ఆయన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి తో పోటీ పడనున్నారు. ప్రవాస భారతీయుడు అయినా కులకర్ణి టెక్సాస్ లో జరిగిన 22 వ జిల్లా మహా సభలో టెక్సాస్ ప్రైమరీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నిలబడి అటార్నీ నన్యాంజా డేవీస్ మూరే ని ఓడించినట్లు తెలుస్తుంది. పిర్లెండ్ సిట్ కౌన్సిల్ సభ్యునిగా పని చేసిన మూరే ని కులకర్ణి ప్రైమరీ ఎన్నికల్లో ఓడించినట్లు పార్టీ ప్రకటించింది. కులకర్ణి గతంలో ఇరాక్‍, రష్యా, ఇజ్రాయెల్‍, తైవాన్‍ లలో దౌత్యవేత్తగా పని చేసిన అనుభవం కూడా ఉంది. ఈ ప్రైమరీ ఎన్నికల్లో కులకర్ణి విజయం సాదించడం తో నవంబర్ లో జరగబోయే ఎన్నికల్లో ఆయన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి తో పోటీ పడడానికి సిద్ధమౌతున్నారు. 2018 లో కూడా ఇదే టెక్సాస్ నగరంలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల్లో త్రుటి లో విజయాన్ని కోల్పోయారు. అయితే ఈ సారి మాత్రం ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు.

కులకర్ణి తండ్రి భారత దేశానికి చెందిన విద్యావేత్త,నవలా రచయిత, అయితే 1969 లోనే ఆయన అమెరికా కు వెళ్లి అక్కడ ఒక యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా సెటిల్ అయ్యి,అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రైమరీ ఎన్నికల్లో కులకర్ణి సునాయాసంగా విజయం సాధించినట్టు తెలుస్తుంది. న్యాయవాది డేవిడ్ మూరే తో పాటు మాజీ పియర్లండ్ నగర కౌన్సిల్ సభ్యుడు డెరిక్ రీడ్లను ఓడించినట్లు పార్టీ తన ప్రకటన ద్వారా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news