బాబోయ్‌.. అది ”సూపర్‌ అనకొండ”.. వైరల్‌ వీడియో..!

-

భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది. లోడుతో ఉన్న 3 గూడ్స్‌ రైళ్లను జాయింట్‌ చేసింది. మూడు రైళ్లు కలిపి 15వేల టన్నుల బరువున్న వస్తువులతో లోడ్‌ అయి ఉన్నాయి. ఈ క్రమంలో ఆ మూడు రైళ్లను జాయింట్‌ చేసిన రైల్వే శాఖ వాటిని బిలాస్‌పూర్‌, చక్రధర్‌పూర్‌ డివిజన్ల మధ్య నడిపించింది. దీంతో రైల్వేశాఖ చరిత్రలో ఓ కొత్త రికార్డు సృష్టించినట్లయింది.

indian railway first time jointed 3 loaded goods train to form anacoda

లోడుతో ఉన్న 3 గూడ్స్‌ రైళ్లను ఒకదాని వెనుక ఒకటి కలిపి ఒక భారీ అనకొండ పాములా మూడు రైళ్లను ఒకేసారి నడిపించామని రైల్వే శాఖ ఈ మేరకు ట్వీట్‌ చేసింది. కాగా సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

వీడియోలో ఒకరైలు వెనుక ఒకటి కలపబడి ఉన్న దృశ్యాలను మనం వీక్షించవచ్చు. రైల్వే శాఖ ఇలా చేయడంలో ఇదే మొదటిసారి. కాగా సరుకు రవాణా సమయాన్ని తగ్గించడం కోసమే ఆ మూడు రైళ్లను అలా కలపాల్సి వచ్చిందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news