helplineదీనితో రైల్వే ప్రయాణికులు సులువుగా సమాచారం తెలుసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు కానీ సందేహాలు కానీ వున్నా ఒకే నెంబర్ కి డైలీ చేసి వివరాలని తెలుసుకోవచ్చు. అయితే మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ రైల్వేస్ ప్రయాణికుల అన్ని సమస్యలు, సందేహాలకు ఒకటే హెల్ప్ లైన్ నెంబర్ తీసుకొచ్చింది. అయితే గతం లో మాత్రం వేర్వేరు అంశాలకు వేరే వేరే నెంబర్లు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అన్నిటిని కలిపి ఒకటే నెంబర్‌ను భారతీయ రైల్వే శాఖ అందుబాటు లోకి తెచ్చింది. ఏదైనా సమస్యలు, సందేహాలకు ఇప్పుడు కేవలం ఒకే నెంబర్ వుంది కాబట్టి ఈజీగా సమాచారం పొందొచ్చు.
అదే 139. గతం లో అయితే 138, 182 రెండూ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం 139 డయల్ చేస్తే చాలు. 139 నెంబర్ తో ఈ రెండింటినీ కూడా అందులో కలిపేస్తున్నారు. ఇలా ఆ రెండిటినీ దశల వారీగా వాటిని తీసేస్తారు. ప్రస్తుతం 139 నెంబర్‌కు రోజుకు 344513 ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయి. ఈ 139 నెంబర్ 12 భాషల్లో అందుబాటులో ఉంది. ఇది ఇలా ఉంటే ఏప్రిల్ 1 నుంచి 182 నెంబర్‌ను 139లో కలిపేస్తారు. కాబట్టి ఇక నుండి 139 కి డైల్ చేస్తే సరిపోతుంది.