రైల్వే ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి క్లారిటీ..

-

రైల్వే ప్రైవేటీకరణపై ఎప్పటి నుంచో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం వరసగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తుండటంతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియాను పూర్తిగా ప్రైవేటైజ్ చేసింది. ఎల్ఐసీ ని కూడా త్వరలో ప్రైవేటీకరిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో భారత రైల్వేను కూడా ప్రైవేట్ పరం చేస్తుందని బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. 

తాజాగా రైల్వే ప్రైవేటీకరణ అంశంపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. రైల్వేను ప్రైవేటీకరించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేనది ఆయన అన్నారు. భద్రత, సౌకర్యాల విషయంలో ప్రయాణికుల ఆకాంక్షలను నెరవేర్చడానికి టెక్నాలజీని రైల్వే రంగంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. రైల్వేల డెవలప్మెంట్ కు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని… ప్రైవేటీకరణపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రైల్వేలో 1.40 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news