Hari Hara Veera Mallu : సెట్లో శ్రీరామ నవమి…పవన్ కళ్యాణ్ పిక్స్ వైరల్

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే… భీమ్లా నాయక్‌ హిట్‌ తో జోష్‌ మీదున్న పవన్‌..వరుసగా మరో రెండు సినిమాలను లైన్‌ లో పెట్టాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” అనే పీరియాడికల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

ఇంతకు ముందు నటసింహం నందమూరిి బాలకృష్ణ తో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ మూవీ రూపొందించిన క్రిష్ ఆ అనుభవంతో ఈ సారి కూడా హరిహర వీరమల్లు లో 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యాన్ని ఎంచుకున్నారు.

ఇందులో మొగల్ పాలకులకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు ” హరిహర వీరమల్లు” గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌ గా నటిస్తోంది. అయితే.. ఇవాళ శ్రీరామ నవమి నేపథ్యంలో.. ” హరిహర వీరమల్లు” సెట్‌ లో వేడుకలు జరిగాయి. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ కూడా వీరమల్లు గెటప్‌ లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news