వరల్డ్ కప్ లో ఇండియా టీం ఎంతో అత్యుత్తమ ప్రదర్సననను కనబరుస్తూ ఇప్పటి వరకు జరిగిన అయిదు మ్యాచ్ లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచి ఉంది. మరొక్క మ్యాచ్ గెలిస్తే సెమీస్ లో స్థానాన్ని దక్కించుకుంటుంది. ఇక వరల్డ్ కప్ లో వివిధ దేశాలకు ప్రాతనిథ్యం వహిస్తున్న ఇద్దరు భారత సంతతికి చెందిన ప్లేయర్స్ అదరగొడుతున్నారు. అందులో మొదటగా చెప్పుకోవలసిన ప్లేయర్ న్యూజిలాండ్ కు చెందిన స్పిన్నర్ ఆల్ రౌండర్ రచీన్ రవీంద్ర గురించి, మొదటిసారి వరల్డ్ కప్ ఆడుతున్నా ఎటువంటి బెరుకు లేకుండా బౌలింగ్, ఫీల్డింగ్ మరియు బ్యాటింగ్ అన్ని విభగాలలో అదరగొడుతూ జట్టును సెమీస్ కు చెరువలోకి తీసుకువెళుతున్నాడు. వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో సెంచరీ చేసి ఆకట్టుకున్న రవీంద్ర, మళ్ళీ ఈ రోజు ఆస్ట్రేలియాపై అద్భుతమైన సెంచరీ చేసి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు రవీంద్ర ఆరు మ్యాచ్ లలో రెండు సెంచరీ లు మరియు రెండు అర్ద సెంచరీ లు చేసి 406 పరుగులతో టాప్ 3 లో కొనసాగుతున్నాడు.
ఇక సౌత్ ఆఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్ కూడా బంతితోనే కాకుండా బ్యాట్ తోనూ రాణించి నిన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కీలక సమయంలో జట్టును గెలిపించి ఆకట్టుకున్నాడు.