వరల్డ్ కప్ లో భాగంగా సెమీస్ కు చేరే నాలుగు జట్లు లేవన్నది ఇంకా ఒక స్పష్టతకు రాలేని పరిస్థితి. ఎందుకంటే… పాయింట్ల పట్టిక ప్రకారం మొదటి నాలుగు స్థానాలలో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా, ఇండియా, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా లు ఉన్నాయి. ఇండియాకు తప్ప మిగిలిన మూడు జట్లకు ఇక మిగిలింది మూడు మ్యాచ్ లు మాత్రమే. మూడింటిలో రెండు గెలిచినా సెమీస్ కు చేరడం ఖాయం. అదే సౌత్ ఆఫ్రికా అయితే ఒకటి గెలిచినా సెమీస్ కు చేరుతుంది. ఇప్పుడు విషయమంతా రెండు క్షణాల గురించే అన్నది ఇక్కడ పాయింట్. ఇండియా మరో నాలుగు మ్యాచ్ లలో ఒకటి గెలిచినా చాలు.. అ లెక్కన ఇండియా సౌత్ ఆఫ్రికా లకు పెద్ద కష్టం కాదు. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లకు కఠినంగా మారే అవకాశాలు ఉండవచ్చు. న్యూజిలాండ్ తన తర్వాత మ్యాచ్ లను సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ మరియు శ్రీలంక లతో ఆడనుంది.
సౌత్ ఆఫ్రికా మరియు పాకిస్తాన్ లను ఓడించడం కష్టం కాకపోయినా సవాలు కూడుకున్నది.. కాబట్టి కివీస్ కు ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి, ఇక ఆస్ట్రేలియా కు సులభమైన మ్యాచ్ లే ఉన్నాయి.. ఇంగ్లాండ్ తో గెలవకపోయినా ఆఫ్ఘన్ మరియు బంగ్లా ను ఓడిస్తే చాలు.