IND VS NZ : టాస్ గెలిచిన న్యూజిలాండ్ .. తొలుత బ్యాటింగ్

-

దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోపీ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైపు అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరు కీలక ఇన్నింగ్స్ ఆడితే భారత్ ఛాంపియన్స్ ట్రోపీ కప్ సాధించడం చాలా సులువు అని పేర్కొంటున్నారు. ఛాంపియన్స్ ట్రోపీ తరువాత రోహిత్ శర్మ రిటైర్ మెంట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు భారత జట్టు గెలవాలంటూ పలు చోట్ల పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు అభిమానులు.

భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కే.ఎల్.రాహుల్, అక్షర్ పటేల్, జడేజా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.

న్యూజిలాండ్ జట్టు :  విల్ యంగ్, రచిన్ రవీంద్ర, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్ వేల్, శాంట్నర్ (కెప్టెన్), హెన్రీ, జెమీసన్, విలియం రూర్కే.

 

Read more RELATED
Recommended to you

Latest news