తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక కొలిక్కి వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడారు ఏఐసీసీ పెద్దలు. ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ నిర్వహించారు. కాసేపట్లో అధిష్టానంకు నివేదిక ఇవ్వనున్నారు మీనాక్షి నటరాజన్.

సీపీఐకి ఒక సీటు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నవారికి నో ఛాన్స్ అన్న సంగతి తెలిసిందే. ఇక అటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పద్మశాలి మహాసభ జరుగుతోంది. ఇక అఖిల భారత పద్మశాలి మహాసభ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అటు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అఖిల భారత పద్మశాలి సంఘం నేతలు పాల్గొన్నారు.