అమెరికా లో భారత టెకీ ఆకస్మిక మృతి…దిక్కుతోచని స్థితిలో కుటుంబం

-

అమెరికాలో భారత టెకీ ఆకస్మికంగా మృతి చెందినట్లు తెలుస్తుంది. భారత్ కు చెందిన టెకీ అంజనీ కుమార్ బచ్చలి తన భార్య మనోజ్ఞ,ఇద్దరు పిల్లలతో కలిసి పెన్సిల్వేనియా లోని చెస్టర్ స్ప్రింగ్స్ లో నివాసముంటున్నాడు. అయితే హెచ్-1 బీ వీసాపై అమెరికాకు వచ్చిన అంజనీ కుమార్ భార్య పిల్లలను డిపెండెంట్ వీసా పై అమెరికాకు తీసుకువెళ్లాడు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన మృతి చెందడం తో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దేశం కానీ దేశంలో ఇద్దరు పిల్లలతో ఆమె ఏం చేయాలి అన్న విషయం కూడా పాలుపోవడం లేదు. హెచ్-1 బీ వీసా కలిగిన భర్త చనిపోవడం తో ఆమె డిపెండెంట్ వీసా రద్దు అయ్యే అవకాశం ఉంది. దీనితో ఆమె పిల్లలఁతి సహా దేశం విడిచిపెట్టి రావాల్సి పడే పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం డిపెండెంట్ వీసా పై వచ్చిన వారు అసలు వ్యక్తి లేనప్పుడు ఆ దేశం విడిచిపెట్టి వెళ్లాల్సి పడుతుంది. దీనితో ఇద్దరు పిల్లలతో ఆమె స్వదేశానికి వెళ్ళడానికి తమను ఆదుకోవాలి అంటూ అంజనీ కుమార్ భార్య మనోజ్ఞ కోరుతుంది. భర్త మృతి తర్వాత ఎలాంటి ఆదాయం లేదని ,ఫ్యామిలీ ని ఆర్ధికంగా ఆదుకొనేందుకు ప్రవాసులు’ గో ఫండ్ మీ’ ద్వారా నిధులు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.

గతేడాది కూడా అమెరికాలో ఇద్దరు భారత టెకీల ఆకస్మిక మృతితో వారి భార్య, పిల్లలకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నవంబర్ 9, 2019లో తాంపాలో ఉండే ప్రశాంత్ పడాల్ గుండెపోటుతో చనిపోయాడు. ఆ తరువాతి నెలలో నార్త్ కరోలినాలో ఉండే చలపతి రాజు కూడా ఆకస్మికంగా మృతి చెందాడు. దీంతో ఈ ఇద్దరిపై ఆధారపడి ఉన్న వారి కుటుంబాలు తిరిగి స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం డిపెండెంట్ వీసా పై వెళ్ళినపుడు వారందరికీ ఈ పరిస్థితి వస్తూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news