భారత upi సేవలను మారిషస్,శ్రీలంకలో ఫిబ్రవరి 12న ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్ ,శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సేవలను ఆయా దేశాల్లో లాంచ్ చేయనున్నారు.అలాగే, మారిషస్‌లో UPI తో పాటు రూపే కార్డ్ సేవలను కూడా ప్రారంభిస్తారని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు.
శ్రీలంక, మారిషస్‌తో ఇండియాకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ప్రజల మధ్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ లావాదేవీల ద్వారా డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించడానికి ఈ సేవలను తీసుకొస్తున్నామని విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీని ద్వారా మారిషస్, శ్రీలంక లకు ప్రయాణించే ఇండియన్స్ అక్కడ యూపీఐ సేవలను ఉపయోగించుకోవచ్చు. అలాగే, మారిషస్‌లో సెటిల్‌మెంట్‌ల కోసం రూపే కార్డ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.ఇప్పటికే ఇండియా యూపీఐ సేవలు చాలా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.