టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీకి ఊహించని షాక్ తగిలింది. సౌరవ్ గంగూలీ ఫోన్ చోరీకి గురైంది.కోల్కత్తా నగరంలోని బెహాలా లో ఉన్న గంగులీ ఇంట్లో దొంగతనం జరిగింది.దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోల్కతాలోని ఆయన ఇంటికి పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గంగూలీ తన ఫోన్ను ఇంట్లోనే పెట్టి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి అది కనిపించలేదు. అందులో కీలక డేటా, వ్యక్తిగత సమాచారం ఉండటంతో ఆయన ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.ఇక ఆ ఫోన్ 1.6 లక్షల విలువ ఉంటుంది.
ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది తెలిసిన వ్యక్తుల పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.