టోక్యో ఒలంపిక్స్ లో ఇండియాకు మరో నిరాశ ఎదురైంది. టోర్నీ ఆరంభం నుంచి దీటుగా ఆడుతూ వస్తున్న… భారత మహిళల హాకీ జట్టు టోక్యో ఒలంపిక్స్ లో ఓటమి పాలైంది. ఒలంపిక్స్ లో చరిత్ర సృష్టించే అవకాశం చేజార్చుకుంది భారత మహిళల హాకీ జట్టు.
పురుషుల హాకీ జట్టు లానే.. అసలైన పోరులో ఓడిపోయింది. కీలకమైన సెమిస్ పోరులో రాణి రాంపాల్ సేన 1-2 తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి నిమిషం వరకు విజయం కోసం ప్రయత్నించినా…. ప్రత్యర్థి జట్టు అర్జెంటీనా తన అనుభవంతో ఆ ప్రయత్నాలను అడ్డుకుంది. భారత్ నుంచి గుర్జిత్ కౌర్ గోల్డ్ చేయగా… అర్జెంటీనా టీం తరఫున… మరియా నోయల్ రెండు గోల్డ్ చేసింది. దీంతో భారత హాకీ జట్టు పై… అర్జెంటీనా టీం 1-2 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో అర్జెంటీనా దేశం ఫైనల్లోకి దూసుకెళ్లింది. అర్జెంటీనా టీం గెలుపుతో టోక్యో ఒలంపిక్స్ నుంచి తప్పుకోక తప్పలేదు.