గతేడాది.. అంటే.. 2020లో కోవిడ్ -19 ( Covid19 ) కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని భావించారు. కానీ అలా జరగలేదు. కోవిడ్ కొత్త కొత్త స్ట్రెయిన్లు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల రెండో వేవ్ ముగిసి మూడో వేవ్ వచ్చింది. ఇక భారత్‌లోనూ రెండో వేవ్ ప్రభావం అయిపోయింది. త్వరలో మూడో వేవ్ వస్తుందని అంటున్నారు. దీంతో కోవిడ్ అసలు ఎప్పుడు అంతం అవుతుంది ? అని అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్ 19 ఇప్పుడప్పుడే అంతం కాదని నిపుణులు ఎప్పుడో చెప్పారు. 1918లో వచ్చిన ఫ్లూ ఇలాగే వ్యాప్తి చెందింది. అందువల్ల కోవిడ్ ఇప్పుడప్పుడే తగ్గదని తెలుస్తోంది. ఇక త్వరలో రానున్న మరిన్ని వేవ్‌లలో కోవిడ్ కొత్త స్ట్రెయిన్లు పుట్టుకు వచ్చి మరింత వేగంగా కరోనా వ్యాప్తి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే కొత్త స్ట్రెయిన్లు టీకాలను కూడా తట్టుకోగలవని అంచనా వేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఇప్పుడు గతంలో కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. డెల్టా వేరియెంట్ గత వేరియెంట్ల కన్నా రెండు రెట్లు ఎక్కువ వేగంగా వ్యాపిస్తోంది. అంటే రోగ నిరోధక శక్తి గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. దాన్ని కూడా తట్టుకుని కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలుస్తుంది. అంటే.. హెర్డ్ ఇమ్యూనిటీ మాటను మనం పక్కన పెట్టాల్సిందేనని నిపుణులు అంటున్నారు.
ఇక దక్షిణాఫ్రికా జనాభాలో 67 శాతం మందికి టీకాలను వేశారు. అయిప్పటికీ కోవిడ్ -19 వ్యాప్తి చెందుతూనే ఉంది. దీంతో ప్రజలకు టీకాలపై అనుమానాలు వస్తున్నాయి. అసలు టీకాలు పనిచేస్తున్నాయా, లేదా అని సందేహిస్తున్నారు. ఈ క్రమంలోనే హెర్డ్ ఇమ్యూనిటీ దశకు ఇంకా రాలేదని స్పష్టమవుతుంది.
సాధారణంగా ఒక గుంపును తీసుకుంటే అందులో కొందరికి వైరస్ సోకుతుంది. కొందరికి సోకదు. అంటే వారికి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్లు లెక్క. కోవిడ్ కొందరికి సోకకపోతే వారికి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్లు భావించాలి. కానీ అందుకు వ్యతిరేకంగా జరుగుతోంది. గతంలో కోవిడ్ బారిన పడని వారికి ఇప్పుడు కోవిడ్ సోకుతోంది. దీంతో హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని ఆశించకూడదని అంటున్నారు. కచ్చితంగా ప్రజలందరికీ టీకాలను వేయాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.