వాసాలమర్రి దళిత వాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. అనంతరం పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. అలాగే వాసాలమర్రి లోని 76 దళిత కుటుంబాలకు తక్షణమే దళిత బంధు అమలు చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. రేపటి నుంచే వాసాలమర్రి లోని దళితుల అకౌంట్లలో 10 లక్షల రూపాయలు జమ అవుతాయని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
దళిత బంధు సొమ్ము పై పూర్తి బాధ్యత మీదేనని… వచ్చిన డబ్బులతో మీ ఇష్టం ఉన్న వ్యాపారం పెట్టుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే వాసాలమర్రి లో భూములు లేని దళితులకు వ్యవసాయ భూములు కూడా త్వరలోనే ఇస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. దళితులు ఇకనుంచి… మంచి జీవితాన్ని గడపాలని చెప్పారు. పేదరికం నుంచి బయటికి రావాలని దళితులకు పిలుపునిచ్చారు. ఇండ్లు లేని దళితులందరికి డబల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని.. చెప్పారు. ఆలేరు నియోజకవర్గంలో 30 కోట్లతో… దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.