టోక్యో ఒలింపిక్స్‌ : సెమీస్‌కు చేరిన భారత మహిళల హకీ జట్టు

-

టోక్యో ఒలింపిక్స్‌ లో భారత మహిళల హకీ జట్టు దుమ్ము లేపింది. అద్భుతమైన ఆట తీరు కనబరిచి… టోక్యో ఒలింపిక్స్‌ లో భారత మహిళల హకీ జట్టు … సెమీ ఫైనల్స్‌ పోరులో కి దూసుకెళ్లింది. ఇవాళ భారత మహిళల హకీ జట్టు మరియు ఆస్ట్రేలియా మహిళల హకీ జట్టు మధ్య కీలక పోరు జరిగింది.

అయితే.. ఈ ఉత్కంఠ పోరులో భారత మహిళల హకీ జట్టు… ఆస్ట్రేలియా జట్టు పై 1-0 తేడాతో గెలిచింది. ఈ అద్భుతమైన విజయంతో భారత మహిళల హకీ జట్టు సెమీస్‌ కు దూసుకెళ్లింది. రెండో క్వార్టర్‌ లో తొలి గోల్‌ చేసిన భారత్‌ మహిళల హాకీ జట్టు.. 22 వ నిమిషం వద్ద గుర్జిత్‌ కౌర్‌ గోల్‌ చేశారు. అయితే… గోల్‌ చేయడానికి ఆస్ట్రేలియా జట్టు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. భారత మహిళల హకీ జట్టు నిలువరించింది. దీంతో 1-0 తేడాతో భారత మహిళల హకీ జట్టు విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news