బాబు, రేవంత్‌ల టార్గెట్ ఒక్కటే…సక్సెస్ అవుతారా?

-

టీడీపీ అధినేత చంద్రబాబు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల టార్గెట్ ఇప్పుడు ఒక్కటే…అది వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలని గెలిపించి అధికారంలోకి తీసుకురావడమే. మామూలుగానే చంద్రబాబు, రేవంత్‌ల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. గతంలో రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు బాబుతో చాలా సన్నిహితంగా మెలిగేవారు. ఇక టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లినా సరే రేవంత్, ఎప్పుడు చందబాబుని గౌరవిస్తూనే ఉన్నారు. అటు చంద్రబాబు సైతం రేవంత్‌ని పరోక్షంగా ఆదరిస్తున్నట్లే కనిపిస్తున్నారు.

ఇలా వేరు వేరు పార్టీల్లో ఉన్న ఈ నాయకుల లక్ష్యంగా ఇప్పుడు ఒకటే. నెక్స్ట్ ఎలాగైనా తమ పార్టీలని అధికారంలోకి తీసుకురావాలి. ఏపీలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ జగన్ దెబ్బకు టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. అయితే పార్టీని మళ్ళీ లైన్‌లో పెడుతూనే, జగన్‌పై పోరాటం చేస్తూ చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఎలాగైనా జగన్ బలాన్ని తగ్గించి, నెక్స్ట్ ఎన్నికల్లో తన బలం ఏంటో చూపించాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీని చిత్తు చేసి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చి, తాను సీఎం పీఠంలో కూర్చోవడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళుతున్నారు.

ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి లక్ష్యం కూడా అదే. కేసీఆర్ దెబ్బకు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఎలా తయారైందో అందరికీ తెలిసిందే. ఇక అలా దారుణంగా ఉన్న కాంగ్రెస్‌ని బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పీసీసీ పదవి దక్కిన దగ్గర నుంచి దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. ఓ వైపు కాంగ్రెస్‌ని బలోపేతం చేసుకుంటూనే, మరోవైపు కేసీఆర్‌ని గద్దె దించాలని చూస్తున్నారు. ఎలాగైనా నెక్స్ట్ కాంగ్రెస్‌కు అధికారం దక్కేలా చేయాలని అనుకుంటున్నారు. అన్నీ బాగుంటే తాను కూడా సీఎం పీఠంలో కూర్చోవాలని అనుకుంటున్నారు. అంటే చంద్రబాబు, రేవంత్‌ల టార్గెట్ సీఎం పీఠమే. మరి ఈ విషయంలో ఇద్దరు నేతలు సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news