న్యూఢిల్లీ: డిజిటల్ విధానంలో భారత్ మరో ముందుడగు వేసింది. నగదు బదిలీ కోసం ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించుకున్నారు. ఇక నుంచి ఈ విధానాన్ని మరింత సులభతరంచేశారు. నగదు రహిత చెల్లింపుల కోసం కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.. ‘ఈ- రూపీ’ విధానాన్ని కాసేపట్లో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
నేషనల్ పేమెంట్షనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. కేంద్ర ఆర్థిక సేవలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సాయంతో ఈ-రూపీ విధానానికి రూపకల్పన చేశారు. క్యూ ఆర్ కోడ్, ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్ ద్వారా లబ్దిదారుడు ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చు.