యూఏఈ లో బ్యాంకులకి భారతీయుల పంగనామం..!!!

-

ఆర్ధిక ఇబ్బందులను దాటడానికో లేదా, వ్యాపారాన్ని  ప్రారంభించడానికో ఎంతో మంది బ్యాంకు నుంచి లోను తీసుకుంటారు. ప్రస్తుత రోజుల్లో ఆశలు కూడా అవసరానికి మించి ఉంటున్నాయి. దానికి తోడుగా బ్యాంకులు క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్లు అంటూ ఆశలు చూపిస్తున్నాయి. దాంతో ముందు వెనుకా ఆలోచన చేయకుండా బ్యాంక్ అందించే సౌకర్యాలు పొండుతున్నారు తద్వారా వారి ఆర్ధిక అవసరాలు తీర్చుకుంటున్నారు..అయితే

బ్యాంకు నుంచి తీసుకున్న వాటిని తిరిగి చెల్లించేస్తే బ్యాంకులకు కూడా మరింత మందికి తమ సేవలని విస్తరింప చేయగలుగుతాయి. లాభాల బాటలో నడుస్తాయి. కానీ చాలా మంది తీసుకున్న డబ్బుని సకాలంలో తిరిగి చెల్లించకపోగా, ఎగవేయడంతో తీవ్ర నష్టాల పాలవుతాయి. ఇదే రకమైన పరిస్థితి ప్రస్తుతం యూఏఈ లో ఉన్న బ్యాంకులలో నెలకొంది. యూఏఈ లోని కొన్ని బ్యాంకులు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయాయట. అందుకు కారణం కూడా భారతీయులేనని అంటున్నారు అధికారులు.

 

యూఏఈ బ్యాంకులలో ఋణాలు పొంది డబ్బులు ఎగవేసిన వారిలో అత్యధికులు భారతీయులేనని ముఖ్యంగా కేరళా వాసులు అత్యధికంగా ఉన్నారని తెలుస్తోంది. సుమారు 50కోట్ల రూపాయల మేర భారతీయుల వలన అక్కడి బ్యాంకులకి నష్టం వాటిల్లిందని, ఋణాలు తీసుకున్న వారు వారి వారి సొంత ప్రాంతాలకి వెళ్లిపోయారని తెలుసుకున్న, బ్యాంకింగ్ సంస్థలు సదరు భారతీయులపై కోర్టులో కేసులు వేయడానికి సిద్దమయ్యిందట.

 

Read more RELATED
Recommended to you

Latest news