ఆమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా జరుగుతుంది..ట్రంప్-బిడైన్ మధ్య కౌంటింగ్ అభ్యర్థులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి..క్షణం క్షణం ఫలితాల సరళి మారుతుంది..ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే బిడైన్ వైట్ హౌస్ చేరడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నట్లు తెలుస్తుంది..ట్రంప్‌కు 214 ఎలక్ట్రోరల్ ఓట్లు రాగా..బిడెన్‌కు మెజార్టీ దగ్గరగా 264 వచ్చాయి..ఇంకా ఆరు రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతుంది..వాటిలో కూడా బిడెన్ అధిక్యంలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కోంటుంది..కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు ట్రంప్ ఓటమికి సవాలక్ష కారణాలు ఉన్నాయి..ట్రంప్ తెంపరితనం గురించి నాలుగేళ్ళుగా అందరికీ తెలిసిందే. ట్రంప్ వ్యవహార శైలి. ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమాజం చూసి ఎప్పటికపుడు ఒక రకమైన అంచనాకు వస్తూనే ఉంది. ఇపుడు ట్రంప్ చాలా తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది లేకపోతే ముంగిట్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు పెట్టుకుని ఆయన భారతదేశం గురించి చాలా దారుణంగా మాట్లాడాడు..భారత్ ప్రజల ఇగోని హర్ట్ చేసేలా ట్రంప్ వాడిన ఒకే ఒక్క మాట ఆయన జాతకం మొత్తం మార్చేసేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు..భారత్ ని గతంలో చాలా సార్లు ట్రంప్ విమర్శించినా కూడా తాజాగా ఆయన మాటలు మాత్రం దారుణమనే చెప్పాలి.
కరోనా వైరస్ వ్యాప్తిపై చివరి వరకూ చైనాను విమర్శించిన ట్రంప్.. అధ్యక్ష అభ్యర్థుల మధ్య చాలా ప్రతిష్టాత్మంగా నిర్వహించే డిబేట్‌లో భారత్ కూడా కరోనా వ్యాప్తి విషయంలో అబద్దాలు చేపుతుందని దారుణ వ్యాఖ్యలు చేశారు..కరోనా లెక్కలు చెప్పడంలో భారత్ ప్రపంచాన్ని మోసం చేస్తోందని కూడా ట్రంప్ ఆరోపించారు..అంతే కాకుండా..భారత్ చైనా, రష్యాలతో కలిపి ఒకే గాటన కట్టిన ట్రంప్ ఈ దేశాలనీ పర్యావరణానికి తీరని హాని చేస్తున్నాయని నిందించారు..భారత్ మురికి దేశం అంటూ నోరు పారేసుకున్న ట్రంప్..దీంతో ప్రవాస భారతీయుల నుంచి ట్రంప్ ఆశించిన స్థాయిలో ఓట్లును పొందలేరని..తన గొయ్యి తానే తీసుకున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..ఇక వెనక్కి తిరిగి చూసుకునేందుకు కూడా ఆయన ఏమీ ఆశలు మిగుల్చుకోలేదని కూడా అంటున్నారు. ఇక ట్రంప్ పని అయిపోయిందని అంతర్జాతీయ విశ్లేషకులు కూడా తేల్చేస్తున్నారు..
ట్రంప్‌కు షాక్ ఇచ్చిన భారతీయలు..ఆ వ్యాఖ్యలే ఓటమికి కారణమా.?
-