ఈ LIC పాలసీ తీసుకుంటే ప్రీమియం ఆపేసినా లాభాలు పొందవచ్చు.. !!

-

ఈ కాలంలో చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు కడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు, ఎలా మన జీవితం అనేది మలుపు తిరుగుతుందో తెలియదు కాబట్టి. సంపాదించిన డబ్బులో కొంత సొమ్మును చాలామంది ఎల్ఐసీ పాలసీ రూపంలో దాచుకుంటున్నారు.. అయితే ఎల్ఐసీ కడుతున్నారు వారు ప్రతి సంవత్సరం ప్రీమియం అమౌంట్ తప్పనిసరిగా పే చేయాలి. లేదంటే బెనిఫిట్స్ అనేవి పొందరు. కొందరు అయితే కొన్ని సంవత్సరాలు డబ్బులు కట్టి తరువాత పాలసీని ఆపేస్తారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. అయితే ఇప్పుడు చెప్పబోయే పాలసీ గురించి వింటే మీరు షాక్ అవుతారు..

పూర్తి వివరాలలోకి వెళితే.. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవన్ లాభ్ పేరుతో ఓ పాలసీ అందిస్తోంది. ఇది లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ పాలసీ అన్నమాట. అంటే మీరు ప్రీమియం కొంత కాలం చెల్లిస్తే చాలు. ప్రీమియం నిలిపివేసిన తర్వాత కూడా మీకు పాలసీ బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు. అంతే కాకుండా పాలసీదారులు పాలసీ మెచ్యూరిటీ కన్నా ముందే అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా మద్దతు కూడా లభిస్తుంది. డెత్ బెనిఫిట్‌ తో పాటు బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ కూడా వస్తాయి. ఒకవేళ పాలసీ ముగిసేవరకు పాలసీదారులు జీవించి ఉంటే మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది.

ఇకపొతే ఈ పాలసీని 8 ఏళ్ల వయస్సు పూర్తి అయినవారు ఎవరైనా తీసుకోవచ్చు. గరిష్ట వయస్సు 59 ఏళ్లు. గరిష్టంగా మెచ్యూరిటీ వయస్సు 75 ఏళ్లు. ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీకి కనీసం రూ. 2,00,000 సమ్ అష్యూర్డ్ ‌తో తీసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. ఈ పాలసీతో పాటు ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ న్యూ టర్మ్ ఇన్స్యూరెన్స్ రైడర్, ఎల్ఐసీ న్యూ క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ ప్రీమియం వేవర్ రైడర్ కలిపి తీసుకోవచ్చు. అలాగే పాలసీ ప్రీమియంను మీ ఇష్టం వచ్చినట్లు కట్టొచ్చు. అంటే మీకు సులభ వాయిదాల్లో ఏడాదికి, ఆరు నెలలకు, మూడు నెలలకు, నెలకు ఓసారి ఇలా చెల్లించొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని ఎల్ఐసీ ఏజెంట్ ను సంప్రదించి పాలసీ వివరాలు తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news