మన సరిహద్దున ఉన్న చైనా సాంకేతికంగా ఆర్ధికంగా ఎంత అభివృద్దిని సాధిస్తుందో, అడ్డమైన వ్యాధులకు, వైరస్ లకు కూడా వేదికగా మారుతుంది. చైనా నుంచి అనేక వ్యాధులు ప్రపంచానికి పరిచయం అవుతున్నాయి తాజాగా చైనాలో ఇప్పుడు ఒక కొత్త వైరస్ పుట్టి ప్రపంచాన్ని భయపెడుతుంది. కోరోనా అనే వైరస్ చైనాలో పుట్టి ఊహించిన దాని కంటే అత్యంత వేగంగా వృద్ది చెందుతుంది. మొత్తం 45 ల్యాబుల్లో వింత వైరస్ని గుర్తించారు.
1700 మందికి అది సోకినట్లు గుర్తించగా ఆల్రెడీ చైనాలోని వుహన్ సిటీలో ఇద్దరు ఈ వైరస్ వల్లే చనిపోయారట. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.) దృష్టికి వెళ్ళడంతో లండన్లోని కొత్త వైరస్లపై పరిశోధనలు చేసే కాలేజీకి శాంపిల్స్ పంపగా అది ఈ మధ్యే పుట్టిన వైరస్ అని గుర్తించారు. కొరోనా అంటే క్రౌన్ (కిరీటం) అని అర్థం. ఈ వైరస్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు… కిరీటం ఆకారంలో ఉండటంతో ఆ పేరు పెట్టారు పరిశోధకులు.
దీనితో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసారు. అమెరికా, సింగపూర్, హాంకాంగ్ ఇలా చాలా దేశాల్లో విమానాశ్రయాల్లో హెల్త్ చెకప్స్ కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. ఈశాన్య రాష్ట్రాల నుంచి భారత్ కి సోకే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొరోనా వైరస్ సోకిన వారికి ముందుగా జలుబు వస్తుంది. ఆ తర్వాత సరిగా ఊపిరాడదట. వైరస్ సోకిన కొన్ని రోజులకే నిమోనియా వచ్చేస్తోంది. సముద్ర చేపల నుంచి ఇది వచ్చినట్టు గుర్తించారు.
Q: What is a #coronavirus?
A: Coronaviruses are a large family of viruses that are known to cause illness ranging from the common cold to more severe diseases such as Middle East Respiratory Syndrome (MERS) and Severe Acute Respiratory Syndrome (SARS) https://t.co/PKzKaO2yfK pic.twitter.com/mhEa7LFVhx
— World Health Organization (WHO) (@WHO) January 17, 2020