నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై భారత్ ప్రకటన చేసింది. నేపాల్ ప్రధాని సుశీలా కర్కి నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తూ ప్రకటన విడుదల చేసింది భారత్. ఇది శాంతి మరియు స్థిరత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది భారత్.

కాగా, ప్రధాని సుశీల కర్కి మంత్రివర్గం నేడు కొలువుదీరనుంది. ఈ మేరకు ప్రకటన చేసింది. ఇది ఇలా ఉండగా….నేపాల్‌లో పరిస్థితులు అత్యంత ప్రమాద కరంగా మారాయి. నేపాల్‌లో కర్ఫ్యూ విధించారు ఆర్మీ అధికారులు. దీంతో సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది భారత్. రాజ్యాంగాన్ని తిరగరాయాలని డిమాండ్ చేశారు యువ నిరసనకారులు. జెన్-జెడ్ ఆందోళనతో అల్లకల్లోలమైంది నేపాల్.