తెలంగాణ, ఏపీకి ప్రజలకు బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం అనుబంధంగా ద్రోణి విస్తరించిందని తెలిపింది APSDMA. దాని ప్రభావంతో నేడు శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షం పడింది.

మరోవైపు, తెలంగాణలోని 5 జిల్లాల కు వాతావరణ శాఖ భారీ వర్ష సూచనలు చేసింది. సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతా ల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది హైదరాబాద్ వాతా వరణ శాఖ. ఈ తరుణంలోనే.. ప్రజలు అలర్ట్ కూడా ఉండాలని సూచనలు చేసింది.