చైనా టార్గెట్ గా ఇండియా,అమెరికా కీలక చర్చలు…!

-

చైనా దూకుడును నిలువరించడమే టార్గెట్ గా ఇండియా, అమెరికా మధ్య 2+2 చర్చలు ప్రారంభమయ్యాయి. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడును నిలువరించేందుకు, దక్షిణాసియాలో ఇండియా స్థానాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు సాగుతున్నాయి. ఇటీవలే వివిధ దేశాలతో వర్చువల్‌ పర్యటనలు సాగిస్తున్న అమెరికా రక్షణ మంత్రి పాంపియో…. భారత్‌ పర్యటనకు స్వయంగా రావడం గమనిస్తే ప్రాధాన్యం అర్థమవుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.

రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు ఈ చర్చలు కీలకంగా ఉంటాయి. తాజా సమావేశాల్లో భారత్‌ …బేసిక్‌ ఎక్స్చేంజ్ అండ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌ కోసం ఎదురుచూస్తోంది. శాటిలైట్‌ సమాచార మార్పిడి ఈ బెకాలో కీలకం. ఈ ఒప్పందం కుదిరితే యూఎస్‌ జియో శాటిలైట్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని ఇండియా వాడుకునే వీలుంటుంది. 2002లో అమెరికాతో భారత్‌ …జనరల్‌ సెక్యూరిటీ ఆఫ్‌ మిలటరీ ఇన్ఫర్మేషన్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2016లో లాజిస్టికల్‌ ఎక్సేంజ్ మెమొరాండమ్‌ అగ్రిమెంట్‌ను , 2018లో కమ్యూనికేషన్, కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్‌ను పూర్తి చేసుకుంది. బెకా పూర్తయితే అగ్రిమెంట్‌ దశలన్నీ పూర్తయినట్లవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version