హాట్ డాగ్స్ అమ్మి కోటీశ్వరుడయిన వ్యక్తి !

-

రోజు గడవడం కోసం అనేక కష్టాలు పడిన వాళ్ళు కోటీశ్వరులుగా మారిన ఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో మధ్య ప్రదేశ్ ఇండోర్‌కు చెందిన విజయ్ సింగ్ రాథోడ్ కథ వాటిలో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అతను 1978 లో నెలకు కేవలం 8 రూపాయలు సంపాదించిన ‘టీ బాయ్’ నుండి, ఇప్పుడు హాట్ డాగ్స్ అమ్ముతూ లక్షాధికారిగా మారాడు ‘దాడు’ గా ప్రసిద్ధి చెందిన రాథోడ్ (60), చప్పన్ డుకాన్ వీధిలో 120 చదరపు అడుగుల దుకాణం ప్రారంభించే ముందు స్టార్లైట్ టాకీస్ వద్ద ‘జానీ హాట్ డాగ్‌’ అనే షాప్ ను ప్రారంభించాడు.

జానీ హాట్ డాగ్ ఇండోర్‌లోనే కాదు, ఇప్పుడు మధ్య ప్రదేశ్ మరియు ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఇక్కడ శాఖాహర, మాంసాహార హాట్ డాగ్స్ దేశీ నెయ్యితో కలిపి అమ్ముతారు. నిజానికి మొదట  రాథోడ్ శాఖాహారం హాట్ డాగ్లను మాత్రమే విక్రయించేవాడు, కానీ ఇప్పుడు అతను మటన్ హాట్ డాగ్లను కూడా విక్రయిస్తాడు. మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ మరియు పిజ్జా హట్ వంటి బడా సంస్థలను వదిలిపెట్టి ఉబెర్ ఈట్స్ ఎపిఎసి రెస్టారెంట్ పార్ట్‌నర్స్ అవార్డ్స్ 2019 లో జానీ హాట్ డాగ్ ‘ఆసియా పసిఫిక్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన మెనూ ఐటెమ్ గా ఎంపిక చేసింది. 

Read more RELATED
Recommended to you

Latest news