ఆ రోడ్డు కింద మీటరు‌కో మృతదేహం..!

-

స్పెడర్ సినిమాలో ఓ సన్నివేశం గుర్తే ఉంటుంది. ఓ కిరాతకుడు మనుషులను చంపుతూ.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న మెట్రో పిల్లర్స్‌లో పాతిపెట్టినట్లు చెబుతాడు. ఇదే సీన్‌తో బహుబలిలో కూడా ఉంటుంది. భళ్లాలదేవ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు బిజ్జలదేవ ‘వంద అడుగుల విగ్రహం.. వంద తలలైనా బలి తీసుకోదా’ అని చెప్తారు. కానీ రీల్ లైఫ్‌లో ఆ సీన్ ఊహిస్తేనే మన ఒళ్లు గబ్బుర పడతాయి. కానీ, ఈ సంఘటనే వాస్తవంగా జరిగింది. ఓ రోడ్డు నిర్మాణం చాలా ప్రత్యేకమైనది. రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి కింద దాదాపు రెండు లక్షల మందిని పాతిపెట్టారు. ఎలాంటి అంతిమ సంస్కారాలు నిర్వహించకుండానే ఆ రహదారిని నిర్మించారు.

రోడ్డు మ్యాప్
రోడ్డు మ్యాప్

ఈ రహదారి పేరు ఎముకల రహదారి. దీనిని రోడ్ ఆఫ్ బోన్స్ అని కూడా పిలుస్తుంటారు. రష్యాలోని కొలిమా ప్రాంతంలో ఈ రోడ్డు ఉంది. ఈ ప్రాంతంలో బంగారు గనులు, ఇతర ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అప్పట్లో కబరోస్క్ ప్రాంతం నుంచి కొలిమా ప్రాంతానికి వెళ్లడానికి కేవలం సముద్రమార్గమే ఉండేది. దీంతో బంగారాన్ని తీసుకురావడానికి చాలా ఆలస్యమయ్యేదని రష్యా అధినేత స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కబరోస్క్ నుంచి నీషి బెస్ట్‌యాక్ వరకు మాత్రమే రోడ్డు నిర్మాణానికి నిర్ణయించుకున్నారు. దీని పొడవు 2,031 కిలోమీటర్లు ఉంటుంది. అయితే రోడ్డు నిర్మాణానికి దేశంలో ఉన్న ఖైదీలను తీసుకెళ్లి 80 క్యాంపులు ఏర్పాటు చేసుకుని రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.

1932లో రోడ్డు పనులు మొదలు పెట్టారు. అయితే ఈ రోడ్డు నిర్మాణం జరిగే ప్రాంతంలో శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల్లో ఉండేందట. దీంతో ఈ ఉష్ణోగ్రతలో పని చేయడం, రాత్రైతే దోమతో సావాసం చేయడంతో ప్రతిరోజు కనీసం 25 మంది మరణించేవారని సమాచారం. అయితే చనిపోయిన వారిని తిరిగి తీసుకెళ్లడానికి శ్రమతోపాటు వ్యయం పెరుగుతుందని రోడ్డు దగ్గరే మీటరుకో మృతదేహం పాతిపెట్టినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి 20 ఏళ్ల అయింది. ఈ క్రమంలో దాదాపు 2.5 లక్షల మంది ఖైదీలను రోడ్డు కిందే పాతి పెట్టారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news