నాగళ్లు ఎత్తి… బీజేపీని కూకటి వేళ్లతో పెకిలి వేయాలి : తెలంగాణ మంత్రి

-

రైతు వ్యతిరేఖ బీజేపీ విధానాలపై నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిజేపి కి కౌంట్ డౌన్ ప్రారంభమైందని.. ఉత్తరాది ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమని హెచ్చరించారు. యూపీ లో అధికార బీజేపీ పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల్లో చేరుతున్నారని.. మోదీ రైతు వ్యతిరేఖ విధానాలపై దేశంలోని రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయని చెప్పారు.

A.Indrakaran-Reddy

ఎరువుల ధరల పెంపు, వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్నదాతలు నాగళ్లు ఎత్తాలని కోరారు. రైతులను ముంచాలనుకుంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలి వేయాలని పిలుపునిచ్చారు. ఎరువుల ధరల పెంపు పై రాష్ట్ర బీజేపీ నేతలు తమ వైఖరిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేఖ విధానాలను వీడనాడాలన్నారు. కేంద్రం దిగి వచ్చే వరకు రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందని.. సీఎం కేసీఅర్ పిలుపు మేరకు అన్నదాతలు, ప్రజాప్రతినిదులు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version