ఇటీవల చెస్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో మాగ్నస్ కారల్ సన్ తో తుదికంటూ పోరాడి ఓడిన ఇండియా గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంధ ను దేశమంతా మెచ్చుకుంటోంది, చిన్న వయసులోనే చెస్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. ఒకప్పుడు చెస్ అంటే హారిక, విశ్వనాథన్ ఆనంద్ లు మాత్రమే గుర్తుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు దేశంలో చాలా మంది చెస్ ను కెరీర్ గా ఎంచుకుని సాధన చేస్తూ ప్రపంచంలోని ఎంతోమంది మేటి ఆటగాళ్లకు చమటలు పట్టిస్తున్నారు. ఇక ప్రజ్ఞానంధ ప్రతిభకు మెచ్చిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ను బహుమతిగా అందించిన సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడూ ఆనంద్ మహీంద్రా ఒక్కరే ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉంటారు.
దేశంలో ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేని ఎందరో ఉన్నారు.. వారిని కూడా ధనవంతులైన ఎంతోమంది ఆదుకుంటే మరింత మంది ఛాంపియన్ లు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.