వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంపెనీ 46వ వార్షిక సమావేశాల్లో ప్రకటించారు. కాగా నీతా అంబానీ బోర్డులో ఇంత కాలం డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె రాజీనామాను బోర్డు డైరెక్టర్లు కూడా అంగీకరించారు. అయితే నీతా అంబానీ బోర్డు నుంచి తప్పుకున్నప్పటికీ కంపెనీ అన్ని బోర్డు సమావేశాలకు హాజరవుతారు.
అయితే వారి పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్ అంబానీలు బోర్డులోకి వస్తుండటంతో ఆమె తప్పుకున్నారు. సంస్థలో ఈ ముగ్గుర్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించనున్నారు. కొన్నేళ్లుగా వీరు ముగ్గురు వ్యాపారాలను చూసుకుంటున్నారు. రిటైల్, డిజిటల్ సర్వీసులు, ఎనర్జీ రంగాలకు చెందని వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. రిలయన్స్ అనుబంధ కంపెనీల బోర్డుల్లోనూ వీరు ఉన్నారు. ఇప్పుడు వీరు బోర్డులోకి వస్తున్న నేపథ్యంలో నీతా రాజీనామాను డైరెక్టర్లు అంగీకరించారు. అయితే అన్ని బోర్డు మీటింగ్‌లకు ఆమె ఓ పర్మినెంట్ ఇన్వైటీగా హాజరవుతారు.