స్ఫూర్తి: ముగ్గరు అక్కచెల్లెళ్లకి ప్రభుత్వ ఉద్యోగాలే.. వీళ్ళ సక్సెస్ స్టోరీ ఇదే..!

-

కొంత మంది సక్సెస్ ని చూస్తే చప్పట్లు కొట్టాలనిపిస్తూ ఉంటుంది. ఈ అక్క చెల్లెల్ని చూస్తే కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. చదువుల మహారాణులు వీళ్ళు. ఈ కుటుంబంలో వీళ్ళు ముగ్గురు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ని సంపాదించేసారు. వీళ్ళ విజయం వెనుక చాలా కష్టం ఉంది. తండ్రి కష్టాన్ని కళ్ళారా చూశారు అందుకే ఎంతో కష్టపడి చదువుకున్నారు. మంచి ఉద్యోగం కోసం అహర్నిశలు శ్రమించారు.

 

ఒకరు కారు ఇద్దరు కాదు ఏకంగా ఈ ముగ్గురు కూడా విద్యావంతులు అయ్యారు ఒకళ్ళేమో డిఎస్పీగా, ఇంకొకళ్ళు డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నత కొలువుల్ని సాధించారు. తల్లిదండ్రులు వీళ్ళ విజయాన్ని చూసి ఫుల్ ఖుష్ అయిపోయారు. లక్ష్మీ ప్రసన్న, మాధవి, లావణ్య లక్ష్మీ ముగ్గురు కూడా ఎంతో కష్టపడి చదువుకున్నారు.

లక్ష్మీ ప్రసన్న కి ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు వచ్చింది డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఈమె ఎంపికయ్యారు. వీళ్ళది టంగుటూరు గ్రామం. సుబ్బారాయుడు సరస్వతికి ముగ్గురు పిల్లలు. తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే వీళ్ళ ముగ్గురు కూడా ఎంతో కష్టపడి చదువుకున్నారట. లావణ్య లక్ష్మి డిఎస్పీగా నియమితులయ్యారు. లక్ష్మీప్రసన్న డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అలానే మూడవ చెల్లెలు కూడా ఉన్నత స్థాయికి ఎదిగారు ఇలా ముగ్గురు కూడా లైఫ్ లో మంచి సక్సెస్ ని అందుకున్నారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news