అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన ఇన్ఫినిక్స్ నోట్ 7 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

-

ఇన్ఫినిక్స్ కంపెనీ ఇన్ఫినిక్స్ నోట్ 7 పేరిట భార‌త్‌లో ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది. ఇందులో 6.95 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి70 ప్రాసెస‌ర్‌ను ఇందులో అమ‌ర్చారు. 4జీబీ వ‌ర‌కు ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. 48, 2, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు వెనుక వైపు 3 ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క భాగంలో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

infinix note 7 smart phone launched

ఇన్పినిక్స్ నోట్ 7 స్పెసిఫికేష‌న్లు…

* 6.95 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1640 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి70 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, 48, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

ఇన్పినిక్స్ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ గ్రీన్‌, బొలివియా బ్లూ, ఏథ‌ర్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. రూ.11,499 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబ‌ర్ 22 నుంచి ల‌భ్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news