దేవుడా.. ఆ కంపెనీ కూడా ఉద్యోగాలు తీసేస్తోందా..?

-

ఆర్థిక మాంద్యం ప్రభావమో.. ముందు జాగ్రత్తో తెలియదు కానీ.. సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఇటీవలే సాఫ్ట్ వేర్ దిగ్గజం కాగ్నిజంట్ తన సంస్థలోని కొందరు ఉద్యోగులకు గుడ్ బై చెప్పేసింది. మరో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం క్యాప్ జెమిని కూడా భారత్ లో 500 మంది ఉద్యోగులను తొలగించేసింది.

ఇప్పుడు అదే బాటలో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ.. ఇన్ఫోసిస్ నడుస్తోంది. సంస్థలోని సీనియర్, మిడిల్ సీనియర్ లెవర్ ఉద్యోగులను ఇళ్లకు పంపుతోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక ఈ విషయాలను వెల్లిడించింది. ఈ సంస్థకు ఈ రెండు విభాగాల్లో దాదాపు 30 వేల మంది వరకూ ఉద్యోగులు ఉంటారని అంచనా. వీరిలో కనీసం 10 శాతం మందికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది.

అంటే దాదాపు 2500 నుంచి 3000 మంది వరకూ ఇంటికి వెళ్లిపోక తప్పదు. కంపనీ ఖర్చులు తగ్గించుకోవడమే ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. మొత్తం 970 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు, వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు సైతం ఇంటికి వెళ్లే అవకాశం ఉంది.

ఉద్యోగుల తొలగింపు వార్తలపై ఆ కంపెనీ కూడా స్పందించింది. అయితే ఇందులో పెద్దగా విశేషం ఏమీ లేదని.. ఇవి సాధారణంగా జరిగే ప్రక్షాళనే అని తమ చర్యను సమర్థించుకుంటోంది. తమ సేవల నాణ్యత మెరుగుపరుచుకోవడంలో భాగంగానే ఇలా చేస్తున్నామని సెలవిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news