ఆరు నెలల చిన్నారికి గూగుల్ లో చూసి ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్.. ఆఖరికి…!

-

డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఆరు నెలల చిన్నారి నిమోనియా తో మరణించడం జరిగింది. ఈ సంఘటన ఒడిస్సా డాబుగామ్ హెల్త్ సెంటర్లో చోటు చేసుకుంది. అయితే అసలు విషయం ఏమిటంటే..? డాక్టర్ గూగుల్ లో సెర్చ్ చేసి చిన్నారికి ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది.

 

ఆ ఆరు నెలల పసిపిల్లాడి తల్లిదండ్రులు ప్రశాంత్ కిశోర్, అమృత మార్చి 31వ తేదీన ఆ హెల్త్ సెంటర్ కి తీసుకు వెళ్ళమని.. ప్రిస్క్రిప్షన్ గూగుల్ లో సెర్చ్ చేసి రాశారని చెప్పారు. ఒడిస్సా టీవీ ఇచ్చిన సమాచారం ప్రకారం డాక్టర్ పిల్లవాడికి ఇంజక్షన్ ఇచ్చారని…అయితే తనకున్న సబ్జెక్టు ప్రకారం ఇంజక్షన్ వ్రాయ లేదని గూగుల్ లో చూసి ఇంజక్షన్ ఇచ్చారని చెప్పారు.

అలానే ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే తన ఆరు నెలల కుమారుడు కళ్ళు మూసి మరణించాడని చెప్పారు. హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ సుభాస్ సాహూ గూగుల్లో సెర్చ్ చేసి ఇంజక్షన్ ఇవ్వడం వల్ల అతన్ని డిస్మిస్ చేశారు.

కేవలం అతని నిర్లక్ష్యం కారణం గానే ఆరునెలల పిల్లవాడు చనిపోయాడని తెలుస్తోంది, పిల్లవాడి తండ్రి బాబు పరిస్థితి బాగోకపోవడం తో ఇక్కడికి తీసుకు వచ్చామని చెప్పారు. కానీ డాక్టర్ నిర్లక్ష్యమే బాబు ప్రాణాలు తీసింది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news