లిక్కర్ కేసులో సీబీఐ చార్జిషీటుపై విచారణ వాయిదా!

-

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ నమోదు చేసిన చార్జిషీటుపై శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తి కావేరి భవేజా నేతృత్వంలో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు.గతంలో విచారణ సందర్భంగా సీబీఐ అందజేసిన చార్జిషీట్ కాపీల్లో చాలా పేజీలు బ్లాంక్‌గా ఉన్నాయని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలోనే సరైన కాపీలను అందజేయాలని సీబీఐ అధికారులను రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.

MLC Kavita is unwell again

తాజాగా విచారణ సందర్భంగా సీబీఐ సమర్పించిన ప్రతులను కోర్టు పరిశీలించింది. ఆ తర్వాత ఇరుపక్షాల వాదనల అనంతరం లిక్కర్‌ కేసులో సీబీఐ చార్జ్‌షీట్‌పై తదుపరి విచారణను నవంబర్‌ 8వ తేదీకి వాయిదా వేస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పుచెప్పింది. కాగా, ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితరులకు సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news