స్ఫూర్తి: రూ.200 కోట్ల విలువైన కంపెనీని నిర్మించిన సాధారణ గృహిణి..!

-

చాలా మంది ఆడవాళ్ళు పెళ్లి అయిపోతే అక్కడితో కెరీర్ ఆగిపోయిందని కేవలం ఇంటికే పరిమితం అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అది నిజం కాదు. పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఆడవాళ్లు అనుకున్నవి సాధించడానికి అవుతుంది. వారి యొక్క కలల్ని, ఆశయాలను చంపేసుకోవాల్సిన పనిలేదు. ఈమె కూడా తన కలల్ని ఆశయాలని పెళ్లి తర్వాత నెరవేర్చుకున్నారు. ఇప్పుడు ఈమె సక్సెస్ ఫుల్ బిజినెస్ వుమెన్ గా రాణిస్తున్నారు.

మరి ఇక ఈమె సక్సెస్ గురించి చూస్తే… పెళ్లయ్యాక ఏడేళ్ల పాటు ఒక గృహిణి గా ఉన్న హరిణి శివ కుమార్ ఇప్పుడు రెండు వందల కోట్ల బ్రాండ్ వ్యవస్థాపకురాలుగా మారింది. ఈమెకి 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వివాహం అయ్యింది. ఆ తర్వాత కొడుకు పుట్టడంతో భవిష్యత్తు అక్కడితో ఆగిపోయింది అని ఈమె అనుకుంది. తన కొడుకు డౌన్ సిండ్రోమ్ కారణంగా సమయాన్ని ఇతర వాటిలో కేటాయించ లేకపోయింది. 5 ఏళ్ల తర్వాత కొడుకు స్కూల్ కి వెళ్ళడం మొదలు పెట్టాడు.

దీంతో మళ్లీ ఆమె తన కలల్ని నెరవేర్చుకోవాలని అనుకుంది. 2015 లో స్వదేశీ చర్మ సంరక్షణను ప్రారంభించింది. ఈమె దీనిపై ఆమె శిక్షణ కూడా తీసుకున్నారు. 2019లో తన తండ్రి సపోర్టుతో ఎర్త్ రిథమ్ అనే బ్రాండ్ గా దీనిని మళ్లీ ప్రారంభించారు. మొదట అయిదు నుండి ఎనిమిది మంది మహిళలతో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు చాలా పెద్ద కంపెనీ అయ్యింది.

ఎర్త్ రిథమ్ లో 100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా 160 ఉత్పత్తుల్ని సేల్ చేస్తున్నారు. రెండు వందల కోట్ల బ్రాండ్ ని ఈమె ఇప్పుడు నడుపుతున్నారు. నిజానికి మొదట్లో అసలు ఈమెకి దీనిపై అవగాహన లేదు అలాంటిది ఇంత స్థాయికి చేరుకున్నారు అంటే మెచ్చుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version