స్ఫూర్తి: హైదరాబాదీ ఆడియో ఉమెన్‌ సాజిదా ఖాన్‌ సక్సెస్ స్టోరీ ని చూస్తే.. తప్పక మెచ్చుకుంటారు..!

-

కొందరిని చూస్తే చాలా ఆదర్శంగా ఉంటారు. అందులోనూ మహిళలు విజయం సాధించారంటే తప్పక మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి మహిళా కూడా తన కెరీర్ లో అనుకున్నంత మాత్రాన్న సక్సెస్ అయిపోలేరు. దానికి తగ్గ ప్రయత్నం చేయాలి అప్పుడే సక్సెస్ అవ్వడానికి అవుతుంది. పైగా కొంత మంది మహిళలు అరుదైన కెరియర్లని తీసుకుంటూ ఉంటారు.

అందులో సక్సెస్ అవ్వడం నిజంగా పెద్ద సమరమే. ఈమె దేశంలో మొట్టమొదటి ఆడియో ఇంజనీర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈమె హైదరాబాద్ కి చెందిన అమ్మాయి. ఈమె పేరు సాజిదా ఖాన్. రాష్ట్రపతి అవార్డుని కూడా ఈమె సొంతం చేసుకున్నారు. సుమారు 15 ఏళ్లలో ఈమె వందకి పైగా సినిమాలకి మ్యూజిక్ ని అందించారు అసలు మహిళలకే ప్రాధాన్యం లేని రంగంలో ఈమె ఇంతలా ఎదగడం అనేది మెచ్చుకోదగ్గ విషయం.

ఇలాంటి అరుదైన రంగంలో మొట్టమొదటిగా సాజిదా ఖాన్ వచ్చారు. భారతదేశంలోనే మొట్టమొదట ఆడియో ఇంజినీర్ అవడం నిజంగా స్ఫూర్తిదాయకం. పోస్ట్ ప్రొడక్షన్లో ఆడవాళ్లు ఎక్కువగా పని చేయరు. కానీ ఈమె అందులోనే రాణించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదగా పురస్కారాన్ని కూడా ఈమె తీసుకున్నారు. ఎంతో కష్టపడితే కానీ ఈ రంగంలో సక్సెస్ అవ్వడం కుదరదు. రోజుకి ఒక్కొక్కసారి 18 గంటలు కూడా పనిచేయాల్సి వస్తుంది.

పైగా ఈ పని చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. చిన్నప్పటినుండి పాటల మీద మ్యూజిక్ మీద ఉండే ఆసక్తి ఆమెను ఇంతవరకు తీసుకువచ్చింది. నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సాధించాలని ఉంటుంది. కానీ వాటిని మనం తేలికగా కాకుండా సాధించాలని… దానికి తగ్గట్టుగా కృషి చేస్తే కచ్చితంగా ఈమె లానే మనం కూడా సక్సెస్ అవ్వచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news